టెన్త్‌లో ఫ‌స్ట్ క్లాస్‌.. బహుమతిగా ఇల్లు ఇచ్చిన అధికారులు..

ఆ బాలిక‌కు చ‌దువంటే ప్రాణం. అందుకే ఉండ‌టానికి ఇల్లు లేక‌పోయినా.. వేసుకోవ‌డానికి స‌రైన బ‌ట్ట‌లు లేక‌పోయినా.. ఫుట్ పాత్‌పై కూర్చొని చ‌దివి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ఫ‌స్ట్ క్లాస్ సంపాదించుకుంది. క‌ష్ట‌ప‌డి చ‌దివి ఏకంగా 68 శాతం మార్కులు తెచ్చుకుంది. ఈ విష‌యం తెలిసిన మున్సిప‌ల్ అధికారులు...

టెన్త్‌లో ఫ‌స్ట్ క్లాస్‌.. బహుమతిగా ఇల్లు ఇచ్చిన అధికారులు..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 2:30 PM

ఆ బాలిక‌కు చ‌దువంటే ప్రాణం. అందుకే ఉండ‌టానికి ఇల్లు లేక‌పోయినా.. వేసుకోవ‌డానికి స‌రైన బ‌ట్ట‌లు లేక‌పోయినా.. ఫుట్ పాత్‌పై కూర్చొని చ‌దివి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ఫ‌స్ట్ క్లాస్ సంపాదించుకుంది. క‌ష్ట‌ప‌డి చ‌దివి ఏకంగా 68 శాతం మార్కులు తెచ్చుకుంది. ఈ విష‌యం తెలిసిన మున్సిప‌ల్ అధికారులు బాలిక‌కు బ‌హుబ‌తిగా ఇంటిని ఇచ్చారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్‌లో ఇది జ‌రిగింది. ఆ బాలిక ప్ర‌తిభ కార‌ణంగా నిలువ నీడ దొరికినందుకు ఆమె త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో నివ‌సిస్తున్న ద‌శ‌ర‌థ్ అనే వ్య‌క్తికి భార్య‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. వీరంద‌రూ ఫుట్ పాత్‌పైనే జీవినం సాగిస్తూంటారు. ప్ర‌తీ రోజూ కూలికి వెళ్తేనే క‌డుపులు నిండుతాయి. అటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టింది భార‌తీ ఖండేక‌ర్. చ‌దువుకుంటే త‌ప్ప త‌మ జీవితాలు మార‌వ‌ని అంత చిన్న వ‌య‌సులోనే న‌మ్మిన భార‌తి క‌ష్ట‌ప‌డి చదువుకుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వెళ్తూ.. ఫుట్ పాత్‌పై చ‌దువుకున్న భార‌తి.. ఇటీవ‌ల వ‌చ్చిన టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌ల్లో 68 శాతం మార్కులు సాధించింది.

కాగా ఆమె ప‌రిస్థితి తెలుసుకున్న మున్సిప‌ల్ అధికారులు.. ఆ బాలిక‌కు ఇంటిని బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భార‌తి ఇంకా పై చ‌దువులు చ‌దువుకోవాల‌ని, మంచి పేరు తెచ్చుకోవాల‌ని చెప్పారు. కాగా క‌లెక్ట‌ర్‌ని కావాల‌నేది త‌న‌ కోరిక అంటూ ఆ బాలిక‌ ప‌ట్టుద‌ల‌తో చెప్ప‌డం మ‌రో విశేషం.

Read More:

క‌రోనా వైర‌స్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం

క‌రోనాకు చెక్ పెట్టేందుకు త‌క్కువ ధ‌ర‌కే మ‌రో జ‌న‌రిక్ మెడిసిన్‌..