Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 52 లక్షల 14 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 96,424 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 1174 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 87,472 • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,678 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,17,774 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 41,12,551 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 84,372 . దేశంలో 78.86 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 19.52 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.62 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశంలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 10,06,615 . దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 6,15,72,343
  • విజయవాడ : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. మాచవరం పిఎస్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్. అర్ధరాత్రి పోలీసుల దాడులు. టీవీ , ల్యాప్ టాబ్, 23 లైన్లో ఉన్న ఫోన్ బాక్స్ , 25 ఫోన్లు స్వాధీనం. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కీలక వ్యక్తి నవీన్ కోసం గాలింపు. క్రికెట్ బుకీలతో ఉన్న సంబంధాల పై విచారణ చేస్తున్న పోలీసులు.
  • జిహెచ్ఎంసి భారీ జరిమానాలు. పదో తారీకు నుంచి 17 వ తారీకు వరకు సుమారు యాభై లక్షలు జరిమానా విధింపు. సింహభాగం బడా షాపింగ్ మాల్స్ దే. బిగ్ బజార్ కు 5 లక్షల 2 వేలు అత్యధిక జరిమానా. చెన్నై షాపింగ్ మాల్ కి 4 లక్షలు. జిపిఆర్ మల్టీప్లెక్స్ 3 లక్షలు. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కు రెండు లక్షల 50 వేల చొప్పున జరిమానా. విఆర్కే సిల్క్, బాంటియా ఫర్నిచర్, ఎల్జి షోరూం కు రెండు లక్షలు చొప్పున జరిమానా. కాచిగూడ ఐనాక్స్ కు ఒక లక్ష ఇరవై రెండు వేల జరిమానా. హ్యాపీ మొబైల్స్ ,ఓయో ,రిలయన్స్ డిజిటల్, విజేత సూపర్ మార్కెట్, ఇంపీరియల్ రెస్టారెంట్ కు లక్ష రూపాయల చొప్పున జరిమానా. అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు , బ్యానర్లు పై భారిగా జరిమానా లు వేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు.
  • అమరావతి : విశాఖ సముద్రంలో విషపూరిత కాలుష్యంపై హైకోర్ట్ లో పిల్ దాఖలు. సముద్ర కాలుష్యంపై నిపుణుల కమిటీ విచారణ కోరుతూ పిల్. పిటిషన్ దాఖలు చేసిన బోలిసెట్టి సత్యనారాయణ, తరుణ్ భారత్ సంఘo వ్యవస్థాపక చైర్మన్ రాజేంద్ర సింగ్. విశాఖలోని రుషికొండ బీచ్‌ చెత్త, వ్యర్థాలు, ప్లాస్టిక్‌, విష పదార్థాలతో కలిసి కలుషితమవుతోందని పిటిషన్. సముద్ర సంపదకు ముప్పు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలు. మెరైన్‌ బయాలజీ, మెరైన్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, ఇండిస్టీస్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. విశాఖతో పాటు కాకినాడ, ఇతర తీరప్రాంతాల్లో కమిటీతో అధ్యయనం చేయించాలని కోరిన పిటిషనర్లు. పరవాడలోని ఫార్మా కంపెనీల నుంచి విష పదార్థాలు, చెత్త విశాఖ మీదుగా పెద్దజాలరిపేట దగ్గర సముద్రతీరంలో కలుస్తోందన్న పిటిషనర్లు. సముద్ర జలాలతోపాటు ఇతర నీటి వనరులు కూడా కలుషితమవుతున్నాయన్న పిటిషనర్లు. ఇలాగే వదిలేస్తే వృక్షాలు, పక్షులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన. ఫార్మాకంపెనీలు ఎన్వి రోన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటెర్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ వాటెర్, ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్న పిటిషనర్లు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా‌ చేర్చిన పిటిషనర్లు.
  • తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపటి నుంచి ఈ నెల 27 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏకాంత బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీవారి ఆలయం. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్న టీటీడీ.
  • అమరావతి: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. భేటీకి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు . దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపణ. ఎంపీ దుర్గాప్రసాద్‌ సంతాప తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చను.. వైసీపీ బాయ్‌కాట్ చేయడం నీచం- చంద్రబాబు. కనీసం ఎంపీ కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించలేదు. రాష్ట్రానికి జీఎస్టీ నిధులు రాబట్టడంపై వైసీపీకి శ్రద్ధలేదు-చంద్రబాబు. అంతర్వేది సహా ఆలయాల దాడులపై సీబీఐ దర్యాప్తు చేయాలి- చంద్రబాబు.

నకిలీ కరోనా రిపోర్ట్.. ఓ బ్యాంక్ మేనేజర్ మ‌ృతి

lab hands over fake negative COVID-19 report to man he dies days later, నకిలీ కరోనా రిపోర్ట్.. ఓ బ్యాంక్ మేనేజర్ మ‌ృతి

Lab hands over fake negative COVID-19  :  కరోనాను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. తప్పుడు పత్రాలతో మాయ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కొవిడ్-19 పరీక్షల పేరుతో అడ్డంగా దోపిడీకి తెరలేపుతున్నారు. ఇలాంటి దందాలతో సామాన్య జనంను కాటికి పంపుతున్నారు. ఇలాంటి దుర్మార్గులు తప్పుడు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ ఉంటే.. నెగటీవ్.. అని నెగటీవ్ రిపోర్ట్ వస్తే దాన్ని కరోనా ఉందంటూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగల్ రాజధాని కొల్ కతాలో ఈ దారుణం జరిగింది. డబ్బుల కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన మోసానికి ఓ బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయారు.

ఆయన భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్ కతాలోని ఓ బ్యాంక్ మేనేజర్ గత కొద్ది రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ డాక్టర్ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. అంతే కాదు ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన వివరాలను డాక్టర్ వారికి ఇచ్చారు. అయితే మేనేజర్ కదలలేనిస్థితిలో ఉండటంతో.. ల్యాబ్ టెక్నీషియనే ఇంటికి వచ్చి శాంపిల్ సేకరించాడు. ఆ తరువాత.. మేనేజర్‌కు కరోనా లేదంటూ ఫోన్‌లో సమాచారం అందించాడు.

వాట్సాప్ ద్వారా కూడా మెస్సెజ్ పంపించడమే కాకుండా.. హార్డ్ కాపీని కూడా కుటుంబసభ్యులకు అందించాడు. అయితే ఇటీవల మేనేజర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్ఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు కరోనా రిపోర్టును పరిశీలించి అది నకిలీదని తేల్చి చెప్పారు.

రిపోర్టుపై ఉన్న పేషెంట్ ఐడీలో తొమ్మిది అంకెలు మాత్రమే ఉన్నాయని, సాధారణంగా కరోనా రిపోర్ట్‌లో 11 అంకెలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. చేతితో ఈ అంకెలు రాయడాన్ని కూడా వారు ఎత్తి చూపారు. అయితే గురువారం నాడు ఆరోగ్యం పరిస్థితి విషమించి మేనేజర్ మృతి చెందారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా సోకిందని ముందుగా తెలిసుంటే భర్తను కాపాడుకోగలిగి ఉండేదాన్నని, నకిలీ రిపోర్టు కారణంగా కాలయాపన జరిగిని భర్త చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Tags