Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • నిమ్స్ డైరెక్టర్ మనోహర్. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీఎంఆర్ వాక్సిన్ ట్రయిల్ నిమ్స్ అసూపత్రిని ప్రకటించారు. 7వ తేదీ నుంచి క్లినిక్ ల ట్రయిల్ ప్రారంభిస్తాం. ఫేస్ 1,ఫేస్ 2 కిందా నిమ్స్ ఆసుపత్రిలో ఈ క్లినిక్ ల ట్రైల్స్ జరుగుతాయి. క్లినిక్ ల ట్రయిల్ భాగస్వామ్యం కావడం కోసం ముందుకు వస్తున్నారు,నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్. వాక్సిన్ తీసుకొనే వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తాం. పరిశీలించిన తరవాత పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుంది . వాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆసుపత్రి అడ్మిట్ చేస్తాం ,ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.

ఆమె తెచ్చే చాక్లెట్ కేక్… నాకో బంపర్ గిఫ్ట్… అద్వానీ

l.k.advani pens protege sushma swaraj death, ఆమె తెచ్చే చాక్లెట్ కేక్… నాకో బంపర్ గిఫ్ట్… అద్వానీ

సుష్మా స్వరాజ్ మృతి పట్ల బీజేపీ అగ్రనేత, మాజీ డిప్యూటీ పీఎం ఎల్.కె. అద్వానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హృదయాన్ని కదిలించే లేఖ రాశారు. ఆమెను తన శిష్యురాలిగా భావించే అద్వానీ.. తన మనసులోని ‘ స్మృతులను ‘ ఈ లేఖ రూపంలో పంచుకున్నారు. తన టీమ్ లో సుష్మ ఎలా చేరారో గుర్తు చేస్తూ ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
‘ నాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ జీ ఆకస్మిక మృతి నన్నెంతో కలచివేసింది. భారతీయ జనతా పార్టీలో తన తొలి అడుగు వేసినప్పటినుంచి ఆమె నాకు తెలుసు. 1980 ప్రాంతాల్లో నేను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆమె ప్రతిభావంతురాలైన యువ కార్యకర్త. నా టీమ్ లో చేరిన కొన్నేళ్లలోనే సుష్మా స్వరాజ్ పార్టీలో పాపులర్, ప్రామినెంట్ లీడర్లలో ఒకరయ్యారు. మహిళా నాయకురాళ్లకు ఆమె ఓ రోల్ మోడల్ గా ఉండేవారు. మంచి వక్త కూడా. ఆయా సంఘటనలు, ఈవెంట్లను గుర్తు తెచ్చుకుని వాటిని ఎంతో స్పష్టంగా తిరిగి వివరించగల ఆమె సామర్థ్యాన్ని చూసి నేను తరచూ ఆశ్చర్యపోయేవాడ్ని. తన మానవతావాదం, మృదు స్వభావంతో ఆమె అందర్నీ ఆకట్టుకోగలిగేవారు. నా పుట్టిన రోజున నాకు అత్యంత ఇష్టమైన చాక్లెట్ కేక్ ను ఆమె తీసుకురాని సంవత్సరమంటూ లేదు. ఈ దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయింది. నాకు ఇది తీరని లోటు. సుష్మ లేకపోవడాన్ని ఎంతో మిస్ అవుతున్నా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుమార్తె బన్సురికి, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను ‘

Related Tags