చెన్నైపై పంజాబ్ ఘన విజయం

మొహాలి: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 2 ఓవర్లు మిగులుండగానే ఛేదించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(71; 36 బంతుల్లో 7×4, 5×6) అర్ధశతకంతో విజృంభించగా  క్రిస్‌గేల్‌(28;  28 బంతుల్లో 2×4, 2×6) చక్కటి సహకారం అందించాడు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించాక హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. ఈ […]

చెన్నైపై పంజాబ్ ఘన విజయం
Follow us

|

Updated on: May 05, 2019 | 8:08 PM

మొహాలి: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 2 ఓవర్లు మిగులుండగానే ఛేదించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(71; 36 బంతుల్లో 7×4, 5×6) అర్ధశతకంతో విజృంభించగా  క్రిస్‌గేల్‌(28;  28 బంతుల్లో 2×4, 2×6) చక్కటి సహకారం అందించాడు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించాక హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. ఈ నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్‌(7) విఫలమైనా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌(36; 22 బంతుల్లో 2×4, 3×6) ధాటిగా ఆడి జట్టుని విజయం వైపు తీసుకెళ్లాడు. ఆఖర్లో నికోలస్‌ పెవిలియన్‌ చేరినా అప్పటికే పంజాబ్‌ విజయం ఖరారైంది. మన్‌దీప్‌సింగ్‌(11), సామ్‌ కరన్‌(6) లాంఖనాన్ని పూర్తిచేసి పంజాబ్‌కు ఆరో విజయాన్ని అందించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10×4, 4×6) ధాటిగా ఆడి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో మెరిశాడు. ఆదిలోనే షేన్‌వాట్సన్‌(7) ఔటవ్వడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రైనా అర్ధశతకం తర్వాత ఔటవ్వగా కాసేపటికే డు ప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై నాలుగు వికెట్లు కోల్పోవడంతో 170 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌కరన్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీశారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే