రాయల్స్ పై పంజాబ్ గెలుపు

ఐపీఎల్ 12వ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్ఠానికి 184 పరుగులు చేసింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో) చెలరేగారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో స్టోక్స్ […]

రాయల్స్ పై పంజాబ్ గెలుపు
Follow us

|

Updated on: Mar 26, 2019 | 10:39 AM

ఐపీఎల్ 12వ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్ఠానికి 184 పరుగులు చేసింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో) చెలరేగారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో స్టోక్స్ 2 వికెట్లు తీయగా… కులకర్ణి, గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 185 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ల నుంచి మంచి శుభారంభాన్ని అందుకుంది. ముఖ్యంగా జోస్ బట్లర్… బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక దశలో గెలుపుకు చేరువలో రాయల్స్ ఉండగా.. అశ్విన్ 13వ ఓవర్ లో ‘మన్కడింగ్’ తో బట్లర్ ను రనౌట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్(20), శాంసన్(30)లు కొద్దిసేపు పరుగులు రాబట్టినా.. వరస వికెట్ల పతనంతో రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్ఠానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో ముజీబ్, అంకిత్, కర్రాన్ చెరో రెండు వికెట్లు తీశారు. పంజాబ్ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన క్రిస్ గేల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.