ప్రాక్టీస్ ప్రారంభించిన పంజాబ్, రాజస్థాన్ జట్లు

అందరికంటే ముందే చేరుకున్నారు.. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ కేంద్రంగా మొదలు కాబోతున్న ఐపీఎల్ వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి...

ప్రాక్టీస్ ప్రారంభించిన పంజాబ్, రాజస్థాన్ జట్లు
Follow us

|

Updated on: Aug 26, 2020 | 6:03 PM

అందరికంటే ముందే చేరుకున్నారు.. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ కేంద్రంగా మొదలు కాబోతున్న ఐపీఎల్ వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. అయితే అక్కడి కొవిడ్ ఆంక్షల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే అందరికన్నా ముందుగా దుబాయ్‌కు చేరుకున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల ఆరు రోజుల క్వారంటైన్‌ ముగించుకున్నాయి. ఆటగాళ్లకు నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని తేలింది. దీంతో బుధవారం సాయంత్రం ఈ రెండు జట్లు అధికారికంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. యూఏఈలో ఉదయం ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి సాయంత్రమే అన్ని జట్లు ప్రాక్టీస్  చేసేందుకు ఇష్ట పడుతున్నాయి.

గత గురువారం పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్ దుబాయ్‌ చేరుకున్నాయి. బస సైతం అక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. అదేరోజు సాయంత్రం చేరుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అబుదాబిలోని ఓ స్టార్ హోటల్‌లో దిగింది. బీసీసీఐ నిబంధన ప్రకారం అక్కడికి చేరుకున్నాక 1, 3, 6 రోజుల్లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేశారు. క్వారంటైన్‌లో ఆటగాళ్లను వారి గదుల నుంచి బయటకు అడుగు పెట్టనీయలేదు.

ఐసీసీ మైదానాల్లో రాజస్థాన్ రాయల్స్‌ సాధన చేయనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ గత శుక్రవారం అక్కడికి చేరుకున్నాయి. వారి క్వారంటైన్‌ గురువారంతో ముగుస్తుంది. అన్ని జట్ల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత అసలు సిసలైన సందడి మొదలవ్వనుంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!