కోరిన కోర్కెలు తీర్చే కురుడుమలె గణపతి

కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం పదమూడున్నర అడుగుల ఎత్తు ఉంది. సుమారు 14అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్టించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు […]

కోరిన కోర్కెలు తీర్చే కురుడుమలె గణపతి
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 5:38 PM

కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం పదమూడున్నర అడుగుల ఎత్తు ఉంది. సుమారు 14అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్టించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెబుతుంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. మరి ఈ దేవాలయ చరిత్ర… దేవాలయంలో కొలువైన గణపతి యొక్క మహిమల గురించి…

స్థలపురాణం:

త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం తెలుపుతున్నది.

గుడి ప్రాకారం

శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వల్ల ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. పూర్వకాంలో దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమంలో అది కాస్త కురుడుమలెగా పేరుగాంచినదని చరిత్రకారులు తెలుపుతున్నారు.

పురాతన ఆలయం 

ఆర్కియాలజీ వారు ఈ గుడిని సుమారు 2000ఏళ్ళ క్రిందటిదని పేర్కొన్నారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మితమైనది. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం. అందుకు ఆధారాలు లేకపోలేదు. కొన్ని రాత్రుళ్ళు అక్కడ ఏవో స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారని అక్కడ పెద్దలు చెబుతుంటారు.

విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకొనేది. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది.

ప్రాశస్త్యం ఏంటంటే

ఇక్కడ ప్రాశస్త్యం ఏంటంటే మీరు అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి.

ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు

ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయన్ని ప్రతి నిత్యం వందల కొద్ది భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారు.

కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి ఆలయం ఈ ఆలయానికి వంద మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించిన వారి అనుగ్రహం పొందుతారు.

సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. అక్కడే 1600ఏళ్ళ నాటి సోమేస్వరస్వామి, అమ్మవార్లు విగ్రహాలు అనుగ్రహిస్తాయి, వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ భక్తుల నమ్మకం. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి దర్శనం దొరకకపోవడం కొసమెరుపు, ఆయన ఆజ్జ లేనదే అక్కడకు వెళ్ళలేము.

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం :

కురుదుమలె సమీపాన 110 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి కురుదుమలె చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్:

కురుదుమలె లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 10 కిలోమీటర్ల దూరంలో హవేరి రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం:

బెంగళూరు, చిక్కబళ్లాపూర్, కోలార్ తదితర సమీప ప్రాంతాల నుండి ప్రతిరోజూ కురుదుమలె కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.