Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

సైరా చూసిన పోలీసులకు ఎస్పీ షాక్

Kurnool Give Shocks to six Sub inspectors for Watching Syeraa Movie, సైరా చూసిన పోలీసులకు ఎస్పీ షాక్

తెలుగు రాష్ట్రాలను సైరా మూవీ మేనియా  కమ్మేసింది. మచ్ వెయిటెడ్ మూవీ కావడంతో చిరంజీవి అభిమానులతోపాటు.. మూవీ పట్ల క్రియేట్ అయిన క్రేజీతో పలువురు సినిమాను తొలిరోజే చూసేందుకు ఉత్సుకత చూపారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలైన థియేటర్లు కిక్కిరిసి పోయాయి. కాకపోతే ఈ సినిమా మోజు.. కర్నూలు జిల్లాలో ఏడుగురు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్ళకు చిక్కు తెచ్చిపెట్టింది. ఉద్యోగాలు పోయే పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా..నరసింహారెడ్డి బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి పట్ల ఉండే క్రేజ్ కు.. సినిమాకున్న చారిత్రక నేపథ్యం తొలిరోజే సినిమా చూడాలన్న ఉబలాటాన్ని కలిగించింది పలువురికి. ఇదే ఫీలింగ్‌తో బుధవారం తెల్లవారుజామున ప్రదర్శించిన స్పెషల్ షోకు కర్నూలు జిల్లాకు చెందిన ఏడుగురు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్ళు వెళ్ళారు. కోయిలకుంట్లలోని థియేటర్ లో మూవీ చూసేందుకు ఈ పోలీసు సిబ్బంది వెళ్ళారు. అయితే ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఇంత మంది పోలీసు సిబ్బంది ఓకే ఉండిపోవడం.. సినిమా చూడడంలో నిమగ్నమైపోవడం.. పోలీసు ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహంతో రగిలిపోయారు. ఏడుగురు ఎస్సైలను వెకెన్సీ రిజర్వు (విఆర్)కు పంపించేశారు. దాంతో సినిమా చూసిన ఉత్సాహం కాస్తా ఆవిరైపోయింది. రాత్రి కోయిలకుంట్లలోని ఒక ఫంక్షన్ హాల్లో డిన్నర్ చేసుకున్న ఏడుగురు ఎస్.ఐ.లు, ఇద్దరు కానిస్టేబుళ్ళు.. ఆ తర్వాత తెల్లవారు జామున వేసిన సైరా స్పెషల్ షోలో సినిమా చూశారు. అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్సై హరిప్రసాద్, బండి ఆత్మకూరు ఎస్సై వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్సై ప్రియతం రెడ్డి, స్పెషల్ బ్రాంచి ఎస్సై అశోక్, గోస్పాడు ఎస్సై నిరంజన్ రెడ్డి  సినిమాకు వెళ్ళగా.. వీరందరినీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కర్నూలు ఎస్పీ ఫకీరప్ప ఆదేశించారు.