కన్న క్షణికావేశం.. ఆ పిల్లల్ని అనాథల్ని చేసింది..!!

Mom Killed Four Of Her Children, కన్న క్షణికావేశం.. ఆ పిల్లల్ని అనాథల్ని చేసింది..!!

కర్నూల్ జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. డోన్‌ తారకరామ నగర్‌కు చెందిన వరలక్ష్మీ అనే మహిళ.. విషం కలిపిన కాఫీని తన నలుగురు పిల్లలకు ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. నలుగురు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈరన్నతో 14 ఏళ్ల క్రితం వరలక్ష్మికి వివాహం జరిగింది. కుటంబకలహాలతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనకు ముందు కూడా వీరిమధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్తతో గొడవల కారణంగా మనస్థాపం చెందిన వరలక్ష్మీ పిల్లలకు ఇచ్చిన పాలల్లో విషం కలిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ తల్లి క్షణికావేశంలో చేసిన చర్య ఇపుడు నలుగురు పిల్లల్ని తల్లి లేని పిల్లల్నిచేసింది. పిల్లలు బతికినా జీవితాంతం తల్లి లేని పిల్లలుగా ఉండాల్సి వస్తుందంటూ స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు దూర దృష్టి ఉండాలని ఆవేదనతో అంటున్నారు.

Mom Killed Four Of Her Children, కన్న క్షణికావేశం.. ఆ పిల్లల్ని అనాథల్ని చేసింది..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *