Kumbh Mela 2021 : ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు పోటెత్తిన జనం.. తొలి రోజు 7 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు..

ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు జనం పోటెత్తారు. తొలి రోజే 7 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. హరిద్వార్‌ గంగానదిలో మొత్తం ఏడు లక్షల 11 వేల మంది భక్తులు...

Kumbh Mela 2021 : ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు పోటెత్తిన జనం.. తొలి రోజు 7 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 3:46 PM

Kumbh Mela 2021 : ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు జనం పోటెత్తారు. తొలి రోజే 7 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. హరిద్వార్‌ గంగానదిలో మొత్తం ఏడు లక్షల 11 వేల మంది భక్తులు హారతిలో పాల్గొన్నారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ ప్రోట్‌కాల్‌ ప్రకారం పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. గురువారం రోజు కొవిడ్‌ నిబంధపలే ఉల్లంఘించిన 974 మంది జరిమానా కూడా విధించారు. ఇటు కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు . ప్రతిసారి 105 రోజుల పాటు నిర్వహించే కుంభమేళాను ఈ సారి కరోనాతొ 48 రోజులకు కుదించారు.