‘బిగ్ బాస్‌’లోకి బోల్డ్ బ్యూటి?

'Kumari 21F' Beauty Hebah Patel in Bigg Boss3?, ‘బిగ్ బాస్‌’లోకి బోల్డ్ బ్యూటి?

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లోకి మరో క్రేజీ హీరోయిన్ చేరింది. తనే క్యూట్ అండ్ బోల్డ్ హెబ్బా పటేల్. ‘కుమారి 21 F’, ’24 కిస్సెస్’ వంటి సినిమాలతో హెబ్బా యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. గ్లామర్ షోకు కూడా ఓకే అనడంతో సినిమా అవకాశాలు భారీగా వచ్చాయి. కానీ స్క్రీప్ట్స్ సెలక్ట్ చేసుకోవడంలో హెబ్బా పూర్తిగా విఫలమైంది. దీంతో చాలా సినిమాలు వరసగా ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ చేతిలో ఒక్క మూవీ కూడా లేదు. దీంతో బిగ్ బాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ వార్త నిజమైతే బిగ్ బాస్ హౌజ్ మరింత కలర్‌ఫుల్ తయారవుతుంది అనడంలో ఎలాంటి డౌటూ లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *