నేడే కర్ణాటక అసెంబ్లీ… దిగనంటే దిగనంటున్న కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. 18 మంది సభ్యుల రాజీనామాలతో పాలక సంకీర్ణ కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో శాసన సభ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్న విశ్వాసాన్ని సీఎం కుమారస్వామి వ్యక్తం చేశారు. నా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి మరింత బలోపేతమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. మేం చాలా విశ్వాసంతో ఉన్నాం.. అసెంబ్లీ సెషన్ ప్రశాంతంగా, సజావుగా […]

నేడే కర్ణాటక అసెంబ్లీ... దిగనంటే దిగనంటున్న కుమారస్వామి
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 1:23 PM

కర్ణాటక అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. 18 మంది సభ్యుల రాజీనామాలతో పాలక సంకీర్ణ కూటమి ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో శాసన సభ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్న విశ్వాసాన్ని సీఎం కుమారస్వామి వ్యక్తం చేశారు. నా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి మరింత బలోపేతమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. మేం చాలా విశ్వాసంతో ఉన్నాం.. అసెంబ్లీ సెషన్ ప్రశాంతంగా, సజావుగా సాగుతుంది అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ట్వీట్ చేస్తూ.. తన సర్కార్ కి ఢోకా లేదన్నారు. మరోవైపు.. కాంగ్రెస్, జేడీ-ఎస్ సీనియర్ నేతలు కూడా తమ సభ్యులు తప్పకుండా సభకు హాజరు కావాలని ఆదేశించారు. బెంగుళూరు శివారులోని ఓ రిసార్టులో జేడీ-ఎస్ శాసన సభ్యులు ‘ సేద ‘ దీరుతున్నారు. సీన్ కట్ చేసి స్పీకర్ కార్యాలయం వైపు చూస్తే.. . రాజీనామాలు చేసిన 18 మంది సభ్యుల రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున ఆయన తమ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలం వృధా చేస్తున్నారని ఈ శాసన సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా-10 మంది రెబల్ శాసన సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టునేడు విచారణ జరపనుంది. తమను బెదిరిస్తున్నారని, స్పీకర్ రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని వీరు దుయ్యబడుతున్నారు.

కోర్టు ఆదేశాలపై వీరంతా గురువారం సాయంత్రం స్పీకర్ కార్యాలయానికి చేరుకొని ఆయనతో భేటీ అయ్యారు. ఖాళీ పేపర్లతో వఛ్చిన వీరు.. ‘ ఫ్రెష్ ‘ గా తమ రాజీనామాలు సమర్పించారు. అనంతరం తిరిగి ముంబై వెళ్లే విమానమెక్కారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని స్పీకర్ రమేష్ కుమార్ ‘ అప్రోచ్ ‘ అయి.. తనకు శాసన సభ్యులు సమర్పించిన రాజీనామాలు అసలైనవో, కావో, వారు వాటిని ఎవరి బలవంతంపైనయినా ఇచ్చారా, లేక స్వచ్ఛందంగానా అన్నది తాను నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

రాజీనామాలను వేరిఫై చేయడమన్నది రాజ్యాంగబధ్దంగా తన విధి అన్నారు. ఇక ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే అది బీజేపీకి ప్రయోజనకరమవుతుంది. మెజారిటీ సాధించే స్థితిలో ఉన్న ఈ పార్టీ.. ఈ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని పట్టుబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎడ్యూరప్ప తగిన ‘ సమయం ‘ కోసం ఎదురుచూస్తున్నారు.

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..