సుష్మాస్వరాజ్‌ను కలిసిన జాదవ్ కుటుంబం

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని పాకిస్థాన్ జైలులో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కుటుంబ సభ్యులు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ని కలిశారు. విదేశీ జైల్లో ఉన్న ఆయన్ను అధికారులు కలుసుకోడానికి విదేశాంగ మంత్రిగా సుష్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుల్‌భూషన్ జాదవ్ కుటుంబం ఈ రోజు నన్ను కలవడానికి వచ్చింది. అంతా మంచే జరుగుతుందని వారికి చెప్పాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె జాదవ్ కుటుంబంతో అత్యంత […]

సుష్మాస్వరాజ్‌ను కలిసిన జాదవ్ కుటుంబం
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 8:04 AM

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొని పాకిస్థాన్ జైలులో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కుటుంబ సభ్యులు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ని కలిశారు. విదేశీ జైల్లో ఉన్న ఆయన్ను అధికారులు కలుసుకోడానికి విదేశాంగ మంత్రిగా సుష్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుల్‌భూషన్ జాదవ్ కుటుంబం ఈ రోజు నన్ను కలవడానికి వచ్చింది. అంతా మంచే జరుగుతుందని వారికి చెప్పాను అంటూ ఆమె ట్వీట్ చేశారు.

విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె జాదవ్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పాక్‌ జైల్లో ఉన్న ఆయన్ను సంప్రదించడానికి అధికారులు, న్యాయనిపుణులతో పనిచేశారు. తాజాగా జాదవ్‌ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించిన వారిలో సుష్మస్వరాజ్ ముందున్నారు. ‘కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది భారత్‌కు దక్కిన గొప్ప విజయం’ అని ఆమె తీర్పు అనంతరం ట్వీట్ చేశారు. దీనిపై ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయస్థానంలో ఈ కేసును విజయవంతంగా వాదించిన హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు.