మరోసారి న్యాయం, ధర్మం గెలిచాయి : కుల్‌భూషణ్ కేసుపై ప్రధాని ట్వీట్

గూఢచర్యం కేసులో పాక్ జైల్‌లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ కేసులో ఆయనకు మరణ శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్ధానం తీర్పు ఇవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. జాదవ్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. మరోసారి న్యాయం, ధర్మం గెలిచాయని ప్రధాని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ప్రతి భారతీయునికి భద్రత, సంక్షేమం కోసమే పనిచూస్తుందని […]

మరోసారి న్యాయం, ధర్మం గెలిచాయి : కుల్‌భూషణ్ కేసుపై ప్రధాని ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 11:50 PM

గూఢచర్యం కేసులో పాక్ జైల్‌లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ కేసులో ఆయనకు మరణ శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్ధానం తీర్పు ఇవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. జాదవ్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. మరోసారి న్యాయం, ధర్మం గెలిచాయని ప్రధాని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ప్రతి భారతీయునికి భద్రత, సంక్షేమం కోసమే పనిచూస్తుందని ప్రధాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజానిజాలను పరిశీలించి వాటి ఆధారంగా తీర్పు ఇచ్చినందుకు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.