రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఎంపికపై చర్చ

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. దీంతో మేయర్ ఎన్నికపై సస్పెన్స్ నెలకొని ఉంది.

రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఎంపికపై చర్చ
Follow us

|

Updated on: Dec 05, 2020 | 7:46 PM

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. దీంతో మేయర్ ఎన్నికపై సస్పెన్స్ నెలకొని ఉంది. ఏ పార్టీకి రౌండ్ ఫిగర్ స్థానాలు రాకపోవడంతో ఇటు టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం కూడా మేయర్‌ పీటంపై కన్నేశాయి. దీంతో ఒక్కసారిగా బల్దియాలో రాజకీయ వేడి అలుముకుంది. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రేపు తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి గెలిచిన కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానించారు.

మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. ఇక ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై కేటీఆర్ సమీక్షించనున్నారు. టీఆర్ఎస్‌కు ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నప్పటికీ మరొకరి సాయంలేకుండా మేయర్ పీటం సాధించే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో సభ్యులందరూ అయోమయంలో పడిపోయారు. అందుకే రేపు జరిగే ఈ సమావేశం కీలకం కానుంది. పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? లేదా అనేది కూడా తెలుస్తుంది. కాగా, గ్రేటర్ మేయర్‌కు మరో రెండు నెలల సమయం ఉంది అప్పటి వరకు చూద్దాం అని కేటీఆర్ ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. మేయర్ రేసులో ఎవరెవరు ఉన్నారనేది కూడా రేపటి సమావేశలో స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.