టీఆర్ఎస్‌లో చేరిన ఇద్దరు టీడీపీ కీలక నేతలు

లోక్‍సభ‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 16 ఎంపీ సీట్లు గెలిచేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్‌బీ కాలనీ నుంచి మందాడి శ్రీనివాసరావు కార్పోరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు […]

టీఆర్ఎస్‌లో చేరిన ఇద్దరు టీడీపీ కీలక నేతలు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 8:04 PM

లోక్‍సభ‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 16 ఎంపీ సీట్లు గెలిచేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సనత్‌నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్‌బీ కాలనీ నుంచి మందాడి శ్రీనివాసరావు కార్పోరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మందాడి శ్రీనివాసరావును కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరావు.. కూన వెంకటేశ్ గౌడ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్… వెంకటేశ్ గౌడ్, మందాడి శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.