బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేటీఆర్.. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలంటూ వ్యాఖ్య

బీజేపీ మేనిఫెస్టోపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్రమంత్రి కేటీ రామారావు.

  • Balaraju Goud
  • Publish Date - 4:16 pm, Thu, 26 November 20
బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేటీఆర్..  కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలంటూ వ్యాఖ్య

బీజేపీ మేనిఫెస్టోపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్రమంత్రి కేటీ రామారావు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల ఫోటోలనే బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకున్నందుకు సంతోషంగా ఉందంటూ.. ట్వీట్ చేశారు. తమ పనితీరుకు దీన్ని పొగడ్తగా భావిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. మరోవైపు, బీజేపీ మేనిఫెస్టోను ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. జవహర్‌నగర్ డంప్‌ యార్డ్‌.. షీ టాయిలెట్స్‌.. .మహిళా పోలీస్ స్టేషన్లు.. ఇలా అన్నీ కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో రూపుదిద్దుకున్న వాటి ఫోటోలను పెట్టుకుని బీజేపీ మేనిఫెస్టోను తయారు చేశారంటూ ఎద్దేవా చేశారు.