కేటీఆర్‌‌కు సీఎం కళ…!

మినిస్టర్ కేటీఆర్..త్వరలోనే చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారా..!. అలాంటి సంకేతాలే కన్పిస్తున్నాయ్ అంటున్నారు రాజకీయ పండితులు. నిన్న వరంగల్ పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రికి ఆల్మోస్ట్ సీఎం రేంజ్‌లో ఏర్పాట్లు జరిగాయి. అధికార పార్టీ నేతలు ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. అంతేనా, మంత్రి కాన్వాయ్‌లో అంబులెన్స్‌తో పాటు రోప్ కాన్వాయ్ వచ్చి చేరాయి. అధికారులు కూడా ఏర్పాట్లకు ఏం తక్కువ చెయ్యలేదు. కేసీఆర్ తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని అసెంబ్లీలో ప్రకటించినా, ఈ ఏడాది ముఖ్యమంత్రి […]

కేటీఆర్‌‌కు సీఎం కళ...!
Follow us

|

Updated on: Jan 08, 2020 | 11:50 AM

మినిస్టర్ కేటీఆర్..త్వరలోనే చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారా..!. అలాంటి సంకేతాలే కన్పిస్తున్నాయ్ అంటున్నారు రాజకీయ పండితులు.
నిన్న వరంగల్ పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రికి ఆల్మోస్ట్ సీఎం రేంజ్‌లో ఏర్పాట్లు జరిగాయి. అధికార పార్టీ నేతలు ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. అంతేనా, మంత్రి కాన్వాయ్‌లో అంబులెన్స్‌తో పాటు రోప్ కాన్వాయ్ వచ్చి చేరాయి. అధికారులు కూడా ఏర్పాట్లకు ఏం తక్కువ చెయ్యలేదు. కేసీఆర్ తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని అసెంబ్లీలో ప్రకటించినా, ఈ ఏడాది ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని కేటీఆర్ న్యూ ఇయర్ రోజు చెప్పినా..వదంతులు మాత్రం ఆగడం లేదు.
డ్రైవర్ రాముడు :
నిట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగిన కేటీఆర్, మడికొండ ఐటీ కంపెనీల వద్దకు వెళ్లే సమయంలో డ్రైవర్ రాముడిగా మారిపోయారు. కాన్వాయ్‌లోని వెహికల్ కాకుండా, సైయెంట్ కంపెనీ ఓనర్ బీవీ మోహన్‌రెడ్డి బెంజ్ కారును ఆయనే స్వయంగా నడిపారు. అయితే అందులో మంత్రి ఉన్నారని తెలియక ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును నిలిపివేశాడు. దీంతో కొంతసేపు హైడ్రామా నడిచింది.