ఇష్టం లేకపోతే వెళ్లిపోండి: డాక్టర్లకు కేటీఆర్ వార్నింగ్

చేతిలో పని ఉంది. పనిచేయడానికి ఫెసిలిటీ ఉంది. అయినా.. మీకెందుకు ఈ నిర్లక్ష్యం. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులకు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన క్లాస్ ఇది. సిరిసిల్ల ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌లు లేక గర్భిణిలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని టీవీ9 రెండు రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలకు ముందుకొచ్చారు. మరోవైపు వైద్య కేంద్రాన్ని.. వైద్యాలయంగా మార్చాలని కేటీఆర్ అన్నారు. ఆస్పత్రిలో మంచి పేరున్న వైద్యులున్నారు. కానీ.. గర్భిణిలకు అవసరమైన […]

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి: డాక్టర్లకు కేటీఆర్ వార్నింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 8:51 PM

చేతిలో పని ఉంది. పనిచేయడానికి ఫెసిలిటీ ఉంది. అయినా.. మీకెందుకు ఈ నిర్లక్ష్యం. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులకు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన క్లాస్ ఇది. సిరిసిల్ల ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌లు లేక గర్భిణిలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని టీవీ9 రెండు రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలకు ముందుకొచ్చారు. మరోవైపు వైద్య కేంద్రాన్ని.. వైద్యాలయంగా మార్చాలని కేటీఆర్ అన్నారు.

ఆస్పత్రిలో మంచి పేరున్న వైద్యులున్నారు. కానీ.. గర్భిణిలకు అవసరమైన డాక్టర్లు లేకపోవడం వల్ల.. చెడ్డపేరు వస్తోంది. సిరిసిల్ల ఏమీ అడవి కాదు.. ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్న పట్టణం. అయినా.. ఎందుకు రావడం లేదు.. ఇక్కడ ఉండాల్సిన వైద్యులు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోతాం అని చెప్పండి. కానీ.. ఆస్పత్రికి రాకపోతే సహించేది లేదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు కేటీఆర్.