దూకుడు పెంచిన కేటీఆర్.. ఏకకాలంలో 3500 మందితో..

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపిల్ మంత్రి కేటీఆర్ దూకుడు పెంచారు. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్న కేటీఆర్.. గురువారం పార్టీ వర్గాలతో ఏకకాలంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం మంది అభ్యర్థులతోపాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల ఇంఛార్జీలు, పార్టీ సీనియర్లతో కలిపి మొత్తం మూడు వేల 5 వందల మందితో ఏక కాలంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికలపై తెలంగాణ భవన్ నుంచి నేరుగా అభ్యర్థులు, […]

దూకుడు పెంచిన కేటీఆర్.. ఏకకాలంలో 3500 మందితో..
Follow us

|

Updated on: Jan 16, 2020 | 2:01 PM

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపిల్ మంత్రి కేటీఆర్ దూకుడు పెంచారు. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్న కేటీఆర్.. గురువారం పార్టీ వర్గాలతో ఏకకాలంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం మంది అభ్యర్థులతోపాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల ఇంఛార్జీలు, పార్టీ సీనియర్లతో కలిపి మొత్తం మూడు వేల 5 వందల మందితో ఏక కాలంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

మునిసిపల్ ఎన్నికలపై తెలంగాణ భవన్ నుంచి నేరుగా అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. ప్రచార వ్యూహాన్ని విస్తరిస్తున్న కేటీఆర్.. దానికి అనుగుణంగా వేగం పెంచారు. టెలికాన్ఫరెన్స్‌లో భాగంగా కొందరు అభ్యర్థులను స్థానికంగా వున్న పరిస్థితిపై వాకబు చేశారు. గతంలో ఏదైనా ఎన్నికల్లో అయిన పోటీ చేశారా? ప్రస్తుతం ప్రచారం ఎలా కొనసాగుతోంది? అంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందని చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని, పెన్షన్‌లు మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కెసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నూతన జిల్లాల వికేంద్రీకరణ ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని కేటీఆర్ అన్నారు.

సుమారు 45 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ తమదని, పట్టణాల కోసం ఇప్పటికే మిషన్ భగీరథలో భాగంగా బల్క్ వాటర్ సప్లై అందిస్తున్నామని అన్నారాయన. పట్టణాల్లోనూ మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని, పట్టణాల్లో 3 లక్షల 75 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని అభ్యర్థులకు వివరించారు.

పట్టణాలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు ఇస్తున్న ప్రభుత్వం తమదేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే టి.యూ.ఎఫ్.ఐ.డి.సి. ద్వారా 2500 కోట్ల రూపాయలతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. స్వచ్చ, హరిత పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చామని, ప్రతి పట్టణానికి నర్సరీని ఏర్పాటు చేయడంతోపాటు హరితహారం పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు.

నూతన మునిసిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక, వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని చెప్పారు. అభ్యర్థులు గెలుపు మనదే అన్న ధీమాలో ప్రచారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్న కేటీఆర్.. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించి ఓట్లు అడగాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. అవసరమైన చోట వార్డుల వారీగా మ్యానిఫెస్టోలు రూపొందించుకోవాలని చెప్పారు.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో