క్రిస్టియన్ మతపెద్దల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్..

విద్య, వైద్య రంగంలో మిషనరీల పాత్రను ఎవరూ కాదనలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కరోనా సమయంలోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్ధవంతమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వైవిధ్యాల సమాహారం మనదేశమన్న కేటీఆర్..

క్రిస్టియన్ మతపెద్దల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 7:54 PM

విద్య, వైద్య రంగంలో మిషనరీల పాత్రను ఎవరూ కాదనలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కరోనా సమయంలోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్ధవంతమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వైవిధ్యాల సమాహారం మనదేశమన్న కేటీఆర్.. ప్రతి 150 కిలోమీటర్ల కు భాష, యాస మారుతున్నది మన దేశంలోనే అని తెలిపారు. అన్నీ ఉన్నా ఎదో వెలితి దేశంలో కనిపిస్తోందని.. చైనా ప్రపంచంలో రెండో బలమైన ఆర్ధిక శక్తి.. మన దేశం ఎక్కడ ఉంది ? అని కేటీఆర్ ప్రశ్నించారు. పీపీఈ కిట్లను కూడా కరోనా ఆరంభంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో క్రిస్టియన్ మతపెద్దల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో క్రైస్తవ సలహా సంఘం ఏర్పాటు చేయాలనీ తాను కూడా ఆశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరుతున్నానని కేటీఆర్ ఈ సందర్భంలో అన్నారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉందన్నారు. తాము మాటలతో కాదు.. చేతలతో సమాధానమిస్తామని.. మంచి పాలన ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని.. క్రిస్టియన్ భవన్ ను త్వరలోనే పూర్తి చేస్తామని.. సమ్మిళిత అభివృద్దే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ చెప్పారు.