Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

, చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

నాగర్‌కర్నూల్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండో హరితవిప్లవానికి కేసీఆర్‌ నాంది పలికారని తెలిపారు.కేసీఆర్‌ ఆలోచన దేశానికి ఆదర్శమన్నారు.

ఏప్రెల్ నుంచి పెంచిన పెన్షన్ రూ 2,016 అందజేస్తామని ప్రకటించారు. 57 ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అద్భుత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరులోని ప్రతి ఎకరాకు నీరందిస్తామని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాను మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 150-160 స్థానాలకు మించవని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ స్థానాలు టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.