మంచినీటికి ఢోకా లేని సిటీ – కేటీఆర్

హైదరాబాద్: హైదరాబాద్ మరో చెన్నై కానుందని.. 48 రోజుల తర్వాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై దర్శకుడు మారుతి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాజధానికి తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి సంధించిన ప్రశ్నకు.. అలాంటిదేమి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. భాగ్యనగరానికి అవసరమైన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు […]

మంచినీటికి ఢోకా లేని సిటీ - కేటీఆర్
Follow us

|

Updated on: Jul 17, 2019 | 4:45 PM

హైదరాబాద్: హైదరాబాద్ మరో చెన్నై కానుందని.. 48 రోజుల తర్వాత భాగ్యనగరానికి తాగు నీరు కష్టమేనని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై దర్శకుడు మారుతి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాజధానికి తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి సంధించిన ప్రశ్నకు.. అలాంటిదేమి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. భాగ్యనగరానికి అవసరమైన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు గురించి పలు అంశాలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్‌కు దర్శకుడు మారుతి ఓ జాతీయ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తన ట్వీట్‌కు జతచేశాడు. ఇందుకు కేటీఆర్ స్పందించారు.

కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఆ రిపోర్ట్ ఖచ్చితమైనది కాదని.. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోవడం ప్రారంభమైతే.. కొద్దివారాల్లో అది ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటుంది. దీనితో రాజధానికి 172 ఎంజీడీల నీరు అందుతుంది. అంతేకాకుండా ప్రజలు నీటి ప్రాధాన్యతను కూడా గుర్తించి.. పొదుపుగా ఉపయోగించుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక దర్శకుడు మారుతి శుభవార్త చెప్పారంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.