వరంగల్ కామంధుడి మరణశిక్షపై కేటీఆర్ ట్వీట్

వరంగల్‌లో సంచలనం రేపిన తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో హంతకుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడటం పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పసిపాపను అత్యాచారం చేసి చంపిన ప్రవీణ్ కు విధించిన ఈ మరణ శిక్ష ముమ్మాటికి సరైన తీర్పు అన్నారు. ఇలాంటి కామంధులు చెలరేగకుండా కఠిన చట్టాలు అవసరమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ కేసులో 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు.. 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. […]

వరంగల్ కామంధుడి మరణశిక్షపై కేటీఆర్ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 10:07 PM

వరంగల్‌లో సంచలనం రేపిన తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో హంతకుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడటం పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పసిపాపను అత్యాచారం చేసి చంపిన ప్రవీణ్ కు విధించిన ఈ మరణ శిక్ష ముమ్మాటికి సరైన తీర్పు అన్నారు. ఇలాంటి కామంధులు చెలరేగకుండా కఠిన చట్టాలు అవసరమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ కేసులో 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు.. 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. ప్రవీణ్ నేరం చేసినట్లు నిర్ధారిస్తూ అతడికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఘటనపై తీర్పు ఇంతత్వరగా రావడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.