పేద విద్యార్థులకు అండగా.. కేటీఆర్ ఆర్థికసాయం

మెరిట్ స్టూడెంట్స్ అయిన పేద విద్యార్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. పేదరికం వల్ల ఉన్నత చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థినులకు నేనున్నానంటూ కేటీఆర్ అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. అనాథాశ్రమంలో ఉంటూ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన ఆమె ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించింది. అయితే, కాలేజీ ఫీజు కట్టలేని ఆమె పరిస్థితిని […]

పేద విద్యార్థులకు అండగా.. కేటీఆర్ ఆర్థికసాయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 9:59 AM

మెరిట్ స్టూడెంట్స్ అయిన పేద విద్యార్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. పేదరికం వల్ల ఉన్నత చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థినులకు నేనున్నానంటూ కేటీఆర్ అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. అనాథాశ్రమంలో ఉంటూ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన ఆమె ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించింది. అయితే, కాలేజీ ఫీజు కట్టలేని ఆమె పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్‌ తన ఇంటికి పిలిచి ఆర్థిక సాయం చేశారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తికి చెందిన మేకల అంజలికి కేటీఆర్ చేయూత అందించారు. ఇండోర్‌ ఐఐటీలో సీటు సాధించిన అంజలి ఫీజు చెల్లించేందుకు ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్‌కు ట్వీట్‌ చేసింది. ఆమెను కూడా తన నివాసానికి పిలిచి కేటీఆర్‌ ఆర్థిక సాయం చేశారు. మొత్తానికి ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.