Breaking News
  • అమరావతి: పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మరో హామీ నేడు శ్రీకారం . నేటి నుండి 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం .క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్ .రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు లబ్ది .వైయస్‌ఆర్‌ జలకళ కోసం రూ.2,340 కోట్లు కేటాయింపు .5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా అందనున్న సాగునీరు .దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం . శాస్త్రీయంగా భూగర్భజలాల లభ్యతపై అంచనా.
  • కృష్ణాజిల్లా : 29 మంది క్రికెట్ బుకీల అరెస్టు. విస్సన్నపేట మండలం కొర్ర తండా లో క్రికెట్ బుకీల పై పోలీసులు దాడులు. 29 మందిని అదుపులోకి తీసుకొని ఒక టీవీ సెల్ఫోన్లు .2000/-రూ..స్వాధీనం చేసుకున్న పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామంటున్న Si లక్ష్మణ్.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అప్డేట్: శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి,సాయికృష్ణ రెడ్డి ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు. శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు.. శ్రావణి కి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలు సేకరించారు.. కస్టడీ ముగియడంతో ఈరోజు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నా పోలీసులు.
  • బండ్ల గ‌ణేష్ ట్వీట్‌ : ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయ‌నున్న బండ్ల గ‌ణేష్‌ .త‌న శ్రేయోభిలాషుల‌కు వండ‌ర్‌ఫుల్ న్యూస్ చెబుతాన‌ని ముందే హింట్ ఇచ్చిన బండ్ల గ‌ణేష్‌ . ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌నతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించార‌ని ట్వీట్‌ .త‌న క‌ల నెర‌వేరుతున్నందుకు ఆనందంగా ఉంద‌న్న బండ్ల గ‌ణేష్‌ .త‌న దేవుడికి ధ‌న్య‌వాదాలు చెప్పిన బండ్ల గ‌ణేష్‌.
  • సుకు డైర‌క్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా .విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సుకుమార్ డైర‌క్ష‌న్‌లో సినిమా .ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది .కేదార్ సెల‌గంశెట్టి నిర్మిస్తున్నారు. .ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ . 2022 నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న సినిమా .ప్యాన్ ఇండియా సినిమా అని ప్ర‌క‌ట‌న.

కేంద్రం నిధులివ్వకపోయినా అభివృద్ధి ఆగదు: కేటీఆర్

కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ఆగడం లేదని రాష్ట్ర మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కే. తారక రామారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాకున్నా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు...

KTR fires on central government, కేంద్రం నిధులివ్వకపోయినా అభివృద్ధి ఆగదు: కేటీఆర్

కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ఆగడం లేదని రాష్ట్ర మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కే. తారక రామారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాకున్నా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల పంపిణీలో జాప్యం జరగడం లేదని ఆయన రాష్ట్ర శాసనమండలిలో బుధవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీకి నిధుల కొరత వున్నా.. నగరంలో ఆస్తిపన్ను, నీటి పన్నులను పెంచడం లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయనన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్.ఆర్.డీ.పీ. ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలో క్యాపిటల్ ఖర్చు 67 కోట్లు చేశామని తెలిపారు. ఇంకా రెవెన్యూ ఖర్చు కలిపితే లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని కేటీఆర్ వివరించారు. లాక్ డౌన్‌ పీరియడ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అద్బుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపిన కేటీఆర్ నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

Related Tags