నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో మెంబర్ షిప్

KTR distributes Rythu Bheema cheques to farmers in Telangana, నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో మెంబర్ షిప్

కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ పరంగా పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం వెళ్తోందన్నారు. నెలరోజుల్లోనే పార్టీ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటడం ఆనందంగా ఉందన్నారు. ఇంకా పలు జిల్లాల్లో సభ్యత్వ నమోదు కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కమిటీలు పటిష్టంగా ఉండేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీరికోసం ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి బీమా కంపెనీకి రూ.11.21 కోట్ల ప్రీమియం చెల్లించామన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *