కేంద్రంపై కేటీఆర్ ధ్వజం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
Follow us

|

Updated on: Nov 01, 2020 | 1:28 PM

KTR blames Central Government: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు అంశాలపైన మంత్రి కే. తారకరామారావు ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే తెలంగాణకు తిరిగి వస్తున్నాయని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం టాక్సుల రూపంలో తెలంగాణ నుంచి తీసుకుందని, అదే సమయంలో కేవలం లక్షా 40 వేల 329 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు.

తెలంగాణ రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ.,తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందని, ముఖ్యంగా కీలకమైన రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి అప్పులు, జీఎస్‌డీపీ రేషియో 22.8 శాతంగా ఉన్నదన్నారు. దేశంలో రుణాలు, జీఎస్‌డీపీ రేషియో తక్కువ కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైనదని, ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014- 2020 మధ్యలో భారతదేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ALSO READ: పోలవరం ప్రొగ్రెస్ మా ఘనతే: చంద్రబాబు

ALSO READ: బీజేపీకి రావుల గుడ్‌బై.. కమలానికి షాక్

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!