సారీ బ్రదర్.. “I Don’t Support”.. అభిమానికి కేటీఆర్ షాకింగ్ ట్వీట్..!
సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుకుగా ఉండే విషయం తెలిసిందే. తాజాగా ఆయన వీరాభిమాని ఒకరు మంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఎవరూ ఏం అడిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రి.. ఈ సారి మాత్రం విచారం వ్యక్తం చేశారు. ఓ వీరాభిమాని వీపుపై కేటీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు ట్వీట్ చేశాడు. అది కూడా తన వీపుపై ఉన్న చిత్రాన్ని తీసి.. కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ. ఈ ట్వీట్ […]
సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుకుగా ఉండే విషయం తెలిసిందే. తాజాగా ఆయన వీరాభిమాని ఒకరు మంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడూ ఎవరూ ఏం అడిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రి.. ఈ సారి మాత్రం విచారం వ్యక్తం చేశారు. ఓ వీరాభిమాని వీపుపై కేటీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు ట్వీట్ చేశాడు. అది కూడా తన వీపుపై ఉన్న చిత్రాన్ని తీసి.. కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ. ఈ ట్వీట్ చూసిన మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒకవేళ నిజమే అయితే.. ఇలాంటివి తాను అస్సలు ఇష్టపడనని తేల్చిచెప్పారు. “సారీ బ్రదర్, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను” అంటూ ఆ వీరాభిమానికి రీప్లై ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇటువంటివి అనారోగ్యకరమన్నారు. రవికిరణ్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్ వచ్చిన నేపథ్యంలో.. కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
Is that for real!!!! ? Sorry brother but I don’t support or endorse these. It’s absolutely unhealthy and disturbing ? https://t.co/JlS7pqE7NO
— KTR (@KTRTRS) February 24, 2020