కొడుకు, అల్లుడు సేఫ్.. మరి సీఎం సార్ కూతురుకు ఎలా న్యాయం చేస్తారు?

What will KCR do for daughter, కొడుకు, అల్లుడు సేఫ్.. మరి సీఎం సార్ కూతురుకు ఎలా న్యాయం చేస్తారు?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముగిసింది. ఎటువంటి సంచలనాలకు, అలకలకు తావు లేకుండా తనకున్న రాజకీయ చాణుక్యతను ఉపయోగించి కేసీఆర్ సేఫ్‌గా మేటర్ సెటిల్ చేశారు. పాతవారికి ఉద్వాసన పలకకుండా కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఈసారి తన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటిచ్చారు.

కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్, ఐటీ, పరిశ్రమల శాఖలునే తిరిగి అప్పగించారు. హరీశ్ రావు గతంలో భారీ నీటిపారుదల శాఖలను నిర్వహించగా, ప్రస్తుతం ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను అలాట్ చేశారు. రేపు బడ్జెట్‌ను కూడా హరీశ్ రావే ప్రవేశపెట్టనున్నారు. అయితే, కొడుకు, మేనల్లుడికి కేబినెట్ బెర్త్‌లు ఇచ్చిన కేసీఆర్ మరి కుమార్తెకు ఎలాంటి అవకాశం ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయిన విషయం తెలిసిందే. రాజకీయంగా మంచి పట్టు, తెలివితేటలు ఉన్న కవిత రైతుల పోరాటం ముందు తలొగ్గాల్సి వచ్చింది. కానీ తెలంగాణ జాగృతినేతగా, పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె సమర్ధవంతమైన పాత్రనే పోషించారు.

అయితే కొడుకు, అల్లుడినిఎటువంటి ఇబ్బంది లేకుండా మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ కూతురు కవితకు ఏ విధంగా న్యాయం చేస్తారనే ఆసక్తి జనాల్లో నెలకుంది.  మొన్నామధ్య ఆమెకు రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలిగా చేస్తారనే రూమర్స్ వచ్చాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి కవితను పోటీచేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాను ఓడిపోయినా నిజామాబాద్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లబోనని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు కేటీఆర్ మినిస్టర్ అయ్యారు గనుక ఆయన ఇప్పుటివరకు చేపట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ ఫోస్ట్‌ను కవితకు ఇస్తారే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజ్యసభకు పంపే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కేసీఆర్ మదిలో ఏ ఆలోచన ఉందో..లెట్స్ వెయిట్ అండ్ సీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *