‘రంగమార్తాండ’ మళ్లీ సెట్స్ పైకి !

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా మొదలెట్టాడంటే చాలు..అమాంతం ఆ ప్రాజెక్ట్‌పై బజ్ పెరిగిపోతుంది. కృష్ణ వంశీ అంటేనే సమ్‌థింగ్ స్పెషల్.

‘రంగమార్తాండ’ మళ్లీ సెట్స్ పైకి !
Follow us

|

Updated on: Oct 25, 2020 | 9:22 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా మొదలెట్టాడంటే చాలు..అమాంతం ఆ ప్రాజెక్ట్‌పై బజ్ పెరిగిపోతుంది. కృష్ణ వంశీ అంటేనే సమ్‌థింగ్ స్పెషల్. అయితే గత కొన్ని ఏళ్లుగా ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. రామ్ చరణ్‌తో తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సో..సోగా ఆడింది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘నటసామ్రాట్’ అనే ఓ మరాఠి సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా మెజార్టీ పార్ట్ చిత్రీకరణ జరిగి… లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ప్రస్తుతం సడలింపులు ఉన్న నేపథ్యంలో వచ్చే వారం నుండి ‘రంగమార్తాండ’ షూటింగ్ ప్లాన్ చేస్తోనట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్‌లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పై కొన్ని కీలక సీన్స్ తీయబోతునట్లు సమాచారం. కృష్ణవంశీ దాదాపు 16 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట. అను దేవదాసిగా నటిస్తోందని టాక్. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మనందం, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు.

Also Read :

నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు వర్షసూచన

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.