Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వాలంటీర్లపై వేటు!

Four Grama Volunteer terminated from services for taking bribe, చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వాలంటీర్లపై వేటు!

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిచడమే లక్ష్యంగా.. దేశంలోనే తొలిసారిగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ సర్కార్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్ సేవలంధిస్తున్నాడు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకుండా..అర్హులైన అందరికి సంక్షేమాన్ని అందించాలని..ఇటీవలే గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పనిలో అలసత్వం, అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఉద్యోగాలలో నుంచి తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్లు తప్పు చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు స్వయంగా సీఎం జగన్ పిలుపునిచ్చి ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.

తాజాగా  విధి నిర్వహణలో చేతివాటం ప్రదర్శించిన నలుగురిని ఉద్యోగం నుంచి తొలగించారు. కృష్ణా జిల్లా రుద్రవరంలో ఈ ఘటన జరిగింది. మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వాలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ, గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుంచి రూ.50/-లు దసరా మాముళ్ళుగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించగా వసూళ్ళకు పాల్పడినట్టు గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కార్యదర్శి నివేదిక, GO.NO.104, గ్రామ వలంటీర్ల నియామక ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన సదరు నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా తొలి దశలోనే వేటు వేస్తే..  మిగతావారికి భయం ఉంటుంది. ఏది ఏమైనా.. గ్రామ సచివాలయ వ్యవస్థను గాడినపెట్టేందుకు జగన్ సర్కారు కఠినంగా ముందుకెళుతోంది.

Four Grama Volunteer terminated from services for taking bribe, చెప్పిందే చేసిన సీఎం జగన్..నలుగురు వాలంటీర్లపై వేటు!