Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

‘Krishna And His Leela’ Teaser: క్ష‌ణం ద‌ర్శ‌కుడు ఈ సారి కొత్తగా థ్రిల్ చేయనున్నాడు..

Krishna And His Leela': Teaser is creative new-age, ‘Krishna And His Leela’ Teaser: క్ష‌ణం ద‌ర్శ‌కుడు ఈ సారి కొత్తగా థ్రిల్ చేయనున్నాడు..

క్షణం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. థ్రిల్లర్ జోనర్‌లో సైలెంట్‌గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఆ సినిమాకు తెలుగు సినిమా ప్రముఖులు ఎంతోమంది ప్రశంసలు ఇచ్చారు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అడవి శేష్ కీలక పాత్ర పోషించినప్పటికి..డైరెక్టర్ రవికాంత్ పేరపు మేకింగ్‌కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ దర్శకుడు పత్తా లేకుండా పోయాడు. క్షణం రిలీజైన నాలుగేళ్లు తర్వాత “కృష్ణ అండ్ హిస్ లీల” మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు రవికాంత్. అది కూడా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మంచి రొమాంటిక్ కథను లైన్లో పెట్టాడు. ఈ మూవీ టీజర్ ‌రీసెంట్‌గా రిలీజయ్యింది.

ఇందులో గుంటూరు టాకీస్ మూవీ ఫేమ్ సిద్దు హీరోగా నటించాడు. మొదటి చిత్రంతో ఆడియెన్స్‌ థ్రిల్‌కి గురిచేసిన దర్శకుడు రవికాంత్..ఈ సారి కాస్త అడల్డ్ కంటెంట్ చిత్రంపై ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. లైఫ్ అంతా రాంగ్ టైమ్‌లో రిలేషన్ ఉంటాను అంటూ హీరోతో తనకున్న బలహీనతను చెప్పించారు. బ్యాగ్రౌండ్లో హేమ చంద్ర పాటిన పులిహోర పాట టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. విజువల్స్ అన్ని గ్రాండియర్‌గా ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్ .. షాలిని .. శీరత్ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు.  ముగ్గురు ముద్దుగుమ్మలతో..హీరో నడిపే ప్రేమాయణం మెయిన్ థీమ్‌గా టీజర్ అయితే యూత్‌ను ఆకట్టకుంటుంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related Tags