కరోనావైరస్ హాట్ స్పాట్స్ కోయంబేడు.. ధారావి

మహారాష్ట్రలోని ధారావి, తమిళనాడులోని కోయంబేడు కరోనా వైరస్ హాట్ స్పాట్స్ గా మారాయి. ధారావితో పోలిస్తే.. కోయంబేడు పరిస్థితి  మరీ ఘోరం.. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్..లో తాజాగా సుమారు 425 కరోనా కేసులు నమోదయ్యాయంటే ఆందోళన కలిగించక మానదు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ మార్కెట్ నుంచే కాయగూరలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి అవుతుంటాయి. ముఖాలకు ఎలాంటి మాస్కులు లేకుండా రోజూ వందలాది […]

కరోనావైరస్ హాట్ స్పాట్స్ కోయంబేడు.. ధారావి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 06, 2020 | 12:50 PM

మహారాష్ట్రలోని ధారావి, తమిళనాడులోని కోయంబేడు కరోనా వైరస్ హాట్ స్పాట్స్ గా మారాయి. ధారావితో పోలిస్తే.. కోయంబేడు పరిస్థితి  మరీ ఘోరం.. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్..లో తాజాగా సుమారు 425 కరోనా కేసులు నమోదయ్యాయంటే ఆందోళన కలిగించక మానదు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఈ మార్కెట్ నుంచే కాయగూరలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి అవుతుంటాయి. ముఖాలకు ఎలాంటి మాస్కులు లేకుండా రోజూ వందలాది ప్రజలు ఈ మార్కెట్ ని విజిట్ చేస్తుంటారు. సోషల్ డిస్టెన్స్ అన్న పదానికి అక్కడ అర్థమే ఉండదు. తమిళనాడు లోని అనేక ప్రాంతాలనుంచి ఈ మార్కెట్ కి ప్రతి రోజూ కొన్ని వందల టన్నుల సరకులు రవాణా అవుతుంటాయి. కరోనా విలయతాండవం చేస్తున్నా ఇక్కడ ఎవరికీ పట్టదు. దగ్గరలోని విల్లుపురం కూడా సుమారు రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, వాటికి ఈ మార్కెట్ తో లింక్ ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక ముంబైలోని ధారావి స్లమ్  ఏరియాలో సుమారు తొమ్మిది లక్షల జనాభా ఉన్నారు. ఈ మురికివాడలో ఉంటున్నవారంతా చిన్నా, చితకా పనులు చేసుకుని జీవించేవారే. ఇక్కడ కూడా సామాజిక దూరం పాటింపు అన్నది ఉండదు. ఈ మురికివాడలో మంగళవారం 40 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  మహారాష్ట్రలో ముంబై.. ధారావి కరోనా కేసులకు ‘అన్ పాపులర్’ అయ్యాయి. రాష్ట్రంలో 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే  వీటిలో ఎక్కువ భాగం ఈ రెండు ప్రాంతాలవే కావడం గమనార్హం.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్