Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

కమల్ పార్టీలో చేరిన కోవై సరళ

, కమల్ పార్టీలో చేరిన కోవై సరళ

చెన్నై : దక్షణాది సినీ పరిశ్రమలో కోవై సరళ అందరికి సుపరిచితురాలే. తనకంటూ సపరేట్ మేనరిజమ్స్, డైలాగ్ డిలవరీ సెట్ చేసుకున్న ఈ నటీమణి తాజాగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కోవై సరళ శుక్రవారం కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ ఇవాళ కోవై సరళను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్‌కు కోవై సరళ పార్టీలో‌ చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుంది.

కొంతకాలంగా రాజకీయాలలో చేరికపై కోవై సరళ దూరంగా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిరకాల మిత్రుడు, సహ నటుడు కమల్ హాసన్‌కు మద్దతు తెలపటంతో పాటు పార్టీలో చేరటం మక్కల్ నీది మయ్యం పార్టీకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ సందర్బంగా కోవై సరళ మాట్లాడుతూ ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్దమని అన్నారు. హాస్య నటిగా దక్షిణాన గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా. ఇకపై రానున్న ఎన్నికల ప్రచారంలో కోవై సరళ వ్యంగ్యాస్త్రాలు ఎలా పేలనున్నాయో చూడాలి మరి.