టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం. కోట్ల దంపతులతో పాటు కుమారుడు రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచారు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనసు మార్చుకున్నారు కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో […]

టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 4:32 PM

టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం. కోట్ల దంపతులతో పాటు కుమారుడు రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచారు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనసు మార్చుకున్నారు కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత.. తమ పార్టీలోకి రావడం అదనపు బలమే అని అంచనా వేస్తోంది టీడీపీ.