కోటప్ప కొండ ఆలయంలో ఇద్దరు అర్చకులకు కరోనా

గుంటూరు జిల్లాలోని ప్రముఖ కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ పనిచేసే ఇద్దరు ముఖ్య అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కోటప్ప కొండ ఆలయంలో ఇద్దరు అర్చకులకు కరోనా
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 5:08 PM

గుంటూరు జిల్లాలోని ప్రముఖ కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ పనిచేసే ఇద్దరు ముఖ్య అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 18వరకు ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నాలుగు రోజుల్లో శానిటేషన్, శుద్ధి చేయనున్నట్లు వారు తెలిపారు. అయితే స్వామి వారి కైంకర్యాలు అర్చక స్వాములచే ఏకాంతముగా నిర్వహించబడతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకోటి రెడ్డి వివరించారు. కాగా ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కు చేరగా.. వారిలో ప్రస్తుతం 15,144 మంది చికిత్స పొందుతున్నారు. 408మంది ఈ వైరస్ సోకి మృత్యువాతపడ్డారు.