బ్యాంక్ కస్టమర్లకు డబుల్ షాక్.. ఏంటో తెలుసా..?

Kotak Mahindra Bank Canara Bank Bank Of Baroda Bank Of India Revise Fixed Deposit Rates, బ్యాంక్ కస్టమర్లకు డబుల్ షాక్.. ఏంటో తెలుసా..?

ఎస్‌బీఐతో పాటు మరో నాలుగు బ్యాంకులు కూడా కస్టమర్లకు షాక్ ఇవ్వబోతున్నాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వంటివి ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, కొత్త ఎఫ్‌డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

కోటక్ మహీంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు ఆగష్టు 29 నుంచి అమలులోకి వచ్చింది. బీఓబీ కొత్త వడ్డీ రేట్లు ఆగష్టు 31 నుంచి మారాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కాగా, కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 31 నుంచి మారాయి. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి కావడం ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాక్ మీద షాక్ తగిలినట్లైంది. ఈ బ్యాంకులు 3.5 శాతం నుంచి 6.85 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే సీనియర్ సిటిజెన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంది.

అయితే, బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై 20న ఎఫ్‌డీ పై వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉంటే 4.50% నుంచి 6.60% వరకు వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 4.25 శాతం నుంచి 6 శాతం మధ్యలో వడ్డీ రేటును అందిస్తోంది. ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరమితిలో ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *