Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

హిట్ పెయిర్‌ను విడదీసిన చిరు..?

What Happened between Koratala Siva and Devi Sri Prasad, హిట్ పెయిర్‌ను విడదీసిన చిరు..?

మెగాస్టార్ చిరంజీవి 152వ మూవీ ప్రారంభమైంది. టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా ఈ మూవీలో నటీనటుల వివరాలు తెలియనప్పటికీ.. సినిమాటోగ్రాఫర్‌గా తిరు.. ఎడిటర్‌గా శ్రీకర్‌ ప్రసాద్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ లిస్ట్‌లో కొరటాల ఫేవరెట్ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ పేరు లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

రైటర్‌గా పలు సినిమాలకు పనిచేసిన కొరటాల శివ.. ‘మిర్చి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత కొరటాల, రామ్ చరణ్‌తో సినిమాకు ప్రకటించగా.. దానికి థమన్‌ను పెట్టుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే అటకెక్కింది. ఆ తరువాత కొరటాల తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాల దేవీ శ్రీనే సంగీతం అందించాడు. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించగా.. ఆ సక్సెస్‌లో దేవీ సంగీతం ముఖ్య పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇక దేవీ అంటే తనకు చాలా ఇష్టమని.. సంగీత దర్శకుడిగా ఆయన ఉన్నప్పుడు.. పాటల గురించి, బ్యాక్‌గ్రౌండ్ సంగీతం గురించి తాను పెద్దగా ఆలోచించనని.. కొరటాల కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అంతేకాదు కొరటాల సినిమా ఖరారు అయిందంటే.. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి టెక్నికల్ విభాగంలో మొదట వినిపించే పేరు దేవీనే. అలాంటిది ఈ ప్రాజెక్ట్‌కు దేవీ పేరు ఎక్కడా వినిపించకపోవడం శోచనీయం.

What Happened between Koratala Siva and Devi Sri Prasad, హిట్ పెయిర్‌ను విడదీసిన చిరు..?

మరోవైపు మెగా ఫ్యామిలీతోనూ దేవీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ఆర్య’ సినిమా ద్వారా మెగా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చిన దేవి.. ఆ తరువాత ఆ ఫ్యామిలీలో తాను పనిచేసిన హీరోలందరికీ గుర్తుండిపోయే ఆల్బమ్స్‌ను ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ- దేవీ కాంబినేషన్‌ అంటే హిట్ కాంబో అని టాలీవుడ్‌లో చాలా మంది ఇప్పటికీ బలంగా నమ్ముతారు. అలాంటిది ఇప్పుడు చిరు- కొరటాల చిత్రానికి దేవీ పేరు లేకపోవడంపై కారణమేంటని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. చిరు వద్దాన్నాడా..? నిర్మాతలు పక్కనపెట్టారా..? కొరటాల వద్దనుకున్నాడా..? అన్న ప్రశ్నలు పలువురిలో మెదలుతున్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా కంటిన్యూ అవుతున్న డీఎస్పీ ఇటీవల కాలంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తన మ్యూజిక్‌ను రిపీట్ చేస్తున్నాడని.. ముందున్న మ్యాజిక్‌ను చూపించలేకపోతున్నాడని  కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతడిని పక్కన పెట్టి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ నమ్మిన వాళ్లకు దేవీ ఎప్పటికైనా మంచి సంగీతం అందిస్తాడని.. అందుకే సుకుమార్, కిశోర్ తిరుమల వంటి వాళ్లు రెమ్యునరేషన్ ఎక్కువైనా అతడిని వదులుకోవడానికి ఇష్టపడరనే వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా హిట్ పెయిర్‌ బ్రేకప్‌కు కారణమెవరు..? చిరు 152 మూవీకి సంగీత దర్శకుడు ఎవరు..? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Tags