మాట మార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీలోకి వెళ్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని ముగునోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదని, ఇప్పటికీ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తోందన్న బాధ, ఆవేదనతోనే టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలని తనకు ఆహ్వానం కూడా రాలేదని పేర్కొన్నారు. తనను పార్టీలో కొనసాగాలని ఓ కార్యకర్త సూచించారని.. ఆ […]

మాట మార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 7:24 AM

బీజేపీలోకి వెళ్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని ముగునోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదని, ఇప్పటికీ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తోందన్న బాధ, ఆవేదనతోనే టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలని తనకు ఆహ్వానం కూడా రాలేదని పేర్కొన్నారు. తనను పార్టీలో కొనసాగాలని ఓ కార్యకర్త సూచించారని.. ఆ కార్యకర్తకు అండగా మాట్లాడితే.. దాన్ని మీడియా తప్పుగా రాసిందని తెలిపారు. ప్రశ్నించే గొంతు లేకుండా టీఆర్ఎస్ చేసిందని.. కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం వస్తే బావుంటుందని తాను చెప్పినట్లు రాజగోపాల్ రెడ్డి వివరించారు. అందరినీ కలుపుకొని వెళ్లడంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా విఫలయ్యారని.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను కూడా ఉద్యమం చేస్తానని పేర్కొన్నారు. తనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.