కమలంతో దోస్తీకి సై అంటోన్నకోమటిరెడ్డి బ్రదర్స్‌ !

K Rajgopal Reddy

తెలంగాణ కాంగ్రెస్‌లో మరి కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ నేతల మాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్‌ షా నాయకత్వాన్ని ఎంతగానో అభినందించారు. జమ్మూ కశ్మీర్‌ అంశంలో కేంద్రం తీసుకున్న ఆర్టీకల్‌ 370 రద్దును దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారని అన్నారు. మోదీ, అమిత్‌ షా నాయకత్వంలో పేదరికం లేని బలమైన దేశంగా భారత్‌ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని చెప్పారు.

యువతకు న్యాయం, పేదరిక నిర్మూలన, వేగవంతమైన అభివృద్ధి బీజేపీ చేయగలదన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఇక కోమటి రెడ్డి బ్రదర్స్‌ బీజేపీలో చేరే విషయమై సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కి అభినందనలు తెలిపిన కోమటిరెడ్డి, నవరత్నాలు కార్యక్రమంతో తండ్రి దివంగత వైఎస్‌ ఆర్‌ పేరుని జగన్‌ నిలబెడతారని ఆశిస్తున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *