ఆరుగురు నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ కోల్ కతా !

  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ గా కనిపిస్తోంది. రోనాల్డ్ రాస్ (మెడిసిన్-1902), రవీంద్ర నాథ్ ఠాగూర్ (లిటరేచర్-1913), సీవీ రామన్ (ఫిజిక్స్-1930), మదర్ థెరెసా (శాంతి-1979), అమర్త్య సేన్ (ఆర్థికవేత్త-1998), అభిజిత్ బెనర్జీ (ఆర్ధికవేత్త-2019).. వీరంతా తమతమ రంగాల్లో జరిపిన విశేష కృషికి ఈ విశిష్ట బహుమతి పొందారు. వీరి వివరాల్లోకి వెళ్తే.. రోనాల్డ్ రాస్ : మెడిసిన్ లో 1902 లో నోబెల్ పొందిన ఈయన […]

ఆరుగురు నోబెల్ గ్రహీతల ' పుట్టినిల్లు ' కోల్ కతా !
Follow us

|

Updated on: Oct 16, 2019 | 8:25 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ గా కనిపిస్తోంది. రోనాల్డ్ రాస్ (మెడిసిన్-1902), రవీంద్ర నాథ్ ఠాగూర్ (లిటరేచర్-1913), సీవీ రామన్ (ఫిజిక్స్-1930), మదర్ థెరెసా (శాంతి-1979), అమర్త్య సేన్ (ఆర్థికవేత్త-1998), అభిజిత్ బెనర్జీ (ఆర్ధికవేత్త-2019).. వీరంతా తమతమ రంగాల్లో జరిపిన విశేష కృషికి ఈ విశిష్ట బహుమతి పొందారు. వీరి వివరాల్లోకి వెళ్తే.. రోనాల్డ్ రాస్ : మెడిసిన్ లో 1902 లో నోబెల్ పొందిన ఈయన అసలు బ్రిటిష్ డాక్టర్. మలేరియాపై రాస్ జరిపిన పరిశోధనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. కోల్ కతాతో రాస్ కు ఎంతో అనుబంధం ఉంది. ఈ నగరంలోని ప్రెసిడెన్సీ జనరల్ ఆసుపత్రిలో పని చేసి ఎంతో పాపులర్ అయ్యారు. నేటికీ ఈ సిటీలో రోనాల్డ్ రాస్ మెమోరియల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. రవీంద్ర నాథ్ ఠాగూర్ : సాహిత్యంలో 1913 లో నోబెల్ పురస్కారం పొందిన రవీంద్ర నాథుడు బెంగాలీ సాహిత్యాన్ని రీ-డిఫైన్ చేశారు. నాన్-యూరోపియన్ అయిన ఈయన భారత జాతీయ గీతాన్ని రచించడమేమిటన్న విమర్శలు ఆనాడే వెల్లువెత్తాయి. ‘ శాంతినికేతన్ ‘ ను స్థాపించి తన సాహితీ క్షేత్రాన్ని రవీంద్రుడు సుసంపన్నం చేశారు. ఇది ఈ నాటికీ ఆర్ట్, కల్చర్ కి ప్రతిరూపంగా ఉంది. సి.వి.రామన్ : 1930 లో భౌతిక శాస్త్రానికి గాను నోబెల్ గ్రహీత అయిన రామన్ నాటి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. సీవీ రామన్ ఎఫెక్ట్ అన్న ఈయన సిధ్ధాంతం భౌతిక శాస్త్రంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వ్యవహరించారు. మదర్ థెరెసా : శాంతిదూత మదర్ థెరెసా ను 1979 లో నోబెల్ వరించింది. అల్బేనియా కుటుంబంలో పుట్టి 1929 లో ఇండియా చేరుకున్న ఈమె కోల్ కతా లో ఛారిటీ మిషనరీస్ నెలకొల్పారు. పేదల కష్టాలను తీర్చడమే తన ధ్యేయంగా నిరాడంబరంగా జీవించారు. అమర్త్య సేన్ : వెల్ ఫేర్ ఎకనమిక్స్ లో తన కృషికి గాను ఆర్థికవేత్త అమర్త్య సేన్ 1998 లో ఈ ప్రతిష్టాత్మక బహుమతి పొందారు. శాంతినికేతన్ లో పుట్టిన ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు. భారత ఆర్ధిక విధానాలపై విశిష్ట పరిశోధనలు చేశారు. అభిజిత్ బెనర్జీ : ఈయనా ఆర్ధిక వేత్తే. అభిజిత్, ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లే ఇద్దరూ ఎకనమిక్స్ లో 2019 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి పొందారు. పేదరిక నిర్మూలన, భారత ఆర్ధిక విధానాలపై ఈ దంపతులు విశేష పరిశోధనలు చేశారు.