Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

మహబూబాబాద్‌లో ఆగిపోయిన మరో ట్రైన్..!

kolhapur express long halt for 3 hours due to technical fault at Mahabubabad, మహబూబాబాద్‌లో ఆగిపోయిన మరో ట్రైన్..!

మహబూబాబాద్‌లో.. మరో ట్రైన్ ఆగిపోయింది. కొల్లాపూర్ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న.. కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్.. సుమారు 3 గంటల పాటు మహబూబాబాద్‌లో నిలిచిపోయింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల మధ్య.. విద్యుత్ తీగ తెగిపోవటం వల్ల రైలు ఆగిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని.. మరమ్మత్తులు చేపట్టారు. దీంతో.. చాలా సేపు .. ఇరువైపుల రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డీజిల్ ఇంజన్ తెప్పించి నిలిచిపోయిన రైలును మరోలైన్‌లో కాజీపేట వరకూ అధికారులు తీసుకెళ్లారు. చీకటిలోనే రైలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది.