Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

ఆర్మీ టోపీలతో బరిలోకి దిగిన కోహ్లీ సేన

, ఆర్మీ టోపీలతో బరిలోకి దిగిన కోహ్లీ సేన

రాంచి: ధోనీ సొంత గ్రౌండ్ రాంచిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగుతోంది. అయితే ఇందులో కోహ్లీసేన అందరికీ షాక్ ఇచ్చింది. భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు.

జమ్మూకశ్మీర్ పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత జట్టు మైదానంలోకి దిగనుంది. మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.