చెలరేగిన కోహ్లీ.. భారత్ ఘన విజయం

kohli on fire india grand victory, చెలరేగిన కోహ్లీ.. భారత్ ఘన విజయం

మోహాలీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ-20లో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే ఘన విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ చెలరేగి ఆడటంతో అర్ధసెంచరీ (72)తో మ్యాచ్ ఇండియా ఖాతాలోకి వచ్చి చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ధావన్, రోహిత్ శర్మలు దూసుకెళ్లారు. అయితే రోహిత్ 33 పరుగుల వద్ద ( 12 )ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీతో ధవన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధవన్ ఔట్ అయ్యాడు.ముఖ్యంగా కోహ్లి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంతగా ఆడినా విరాట్, ధావన్‌ల భాగస్వామ్యం భారత్ విజయాన్ని నిర్ణయించింది. ఈ మ్యాచ్‌తో టీ 20 సిరీస్‌ ఇండియా 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లినట్టయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *