కోహ్లీకి ఆ హక్కుంది.. దాదా మద్దతు!

Kohli Has Right To Give His Opinion On Coach Selection Says Ganguly, కోహ్లీకి ఆ హక్కుంది.. దాదా మద్దతు!

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని మరోసారి ఎంపిక చేస్తే సంతోషిస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు మాజీలు ఖండించగా.. దాదా సౌరవ్ గంగూలీ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి కోచ్ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందన్నాడు. 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన క్రికెట్‌ సలహా కమిటీలో గంగూలీ, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కోచ్‌ ఎంపిక బాధ్యతలు కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతన్‌ రంగస్వామి కమిటీకి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *