Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ ఎన్నికలకు పచ్చజెండా. జూన్ 19న ఎన్నికలకు ముహూర్తం ఖరారు. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలు. చాలా సీట్లు ఏకగ్రీవ ఎన్నిక. 18 స్థానాలకు ఏర్పడ్డ పోటీ. 18 స్థానాలకు జరగనున్న ఎన్నికలు.
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం రెండు ప్యాకేజీలు. ఖాయిలా పడ్డ పరిశ్రమల కోసం రూ. 20వేల కోట్లతో ఒక ప్యాకేజి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో రూ. 50వేల కోట్లతో ఈక్విటీ. కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • కొసాగగుతున్న నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వ వార్. హై కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం. నిమ్మగడ్డ రమేష్ కేసులో మరో కీలక మలుపు. సుప్రీంకోర్టు లో ఎస్ ఎల్ పి దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పరిశీలనలో ఏపీ ప్రభుత్వ ఎస్ ఎల్ పి. ఇప్పటికే కెవియట్ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలి. మస్తాన్ వలి తరపు న్యాయవాడులకి సమాచారం ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

ఇస్తానన్నా వేధింపులెందుకు..? కోడెల ఫైర్

Kodela Siva Prasada Rao responds on robbery at his home, ఇస్తానన్నా వేధింపులెందుకు..? కోడెల ఫైర్

తన ఇంట్లో చోరీపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. నిన్న రాత్రి అర్జున్ అనే వ్యక్తి తన ఇంట్లో కంప్యూటర్లు అపహరించాడని ఆయన ఆరోపించారు. కరెంట్ బాగు చేయడానికనే పేరుతో మరొకరితో కలిసి వచ్చిన అర్జున్.. కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లారని ఆయన అన్నారు. గతంలో అర్జన్ తమ ఆఫీసులో పనిచేసేవాడని, ప్రస్తుతం అతడు వైసీపీ ఆఫీసులో ఉన్నాడని కోడెల అన్నారు. తమ డేటా చోరీ చేయడం వెనుక కారణాలేంటో తెలియాలని.. దీనిపై విచారణ జరగాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అధికార పార్టీ బతకనివ్వడం లేదని ఈ సందర్భంగా కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫర్నీచర్ వివరాలన్నీ లేఖలో తెలియజేశానని.. ఫర్నీచర్ తిరిగి అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న కోడెల.. ఇచ్చేందుకు రెడీగా ఉన్నా వేధింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

Related Tags