కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు: కుటుంబసభ్యులు

kodela family says no to government honours for funeral, కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు: కుటుంబసభ్యులు

వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఆయన ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందినట్టు డాక్టర్లు కూడా ధృవీకరించడంతో.. కుటుంబసభ్యులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చర్యలతోనే.. ఆయన తీవ్రమైన భయాందోళనకు, మానసిక ఆందోళన చెందారని.. అందుకే ఇలా ఆత్మహత్య చేసుకున్నారని కోడెల కుటుంబసభ్యులు విమర్శిస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ వేధింపులు ఎక్కువైనట్లు.. పలుమార్లు కోడెల.. వారి వద్ద చెప్పినట్టు సన్నిహితులు కూడా తెలిపారు.

కాగా.. దీంతో.. ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబసభ్యులకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వేధింపుల వల్లనే కోడెల చనిపోయారని.. అందుకే అధికార లాంఛనాలు వద్దని కోడెల కుటుంబసభ్యులు, సన్నిహితులు ప్రభుత్వానికి తెలిపారని సమాచారం. ప్రభుత్వ లాంఛనాలతో.. కోడెల అంత్యక్రియలు జరిగితే.. ఆయన ఆత్మ శాంతించదని.. ప్రభుత్వ అక్రమ కేసుల వలనే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని.. కుటుంబసభ్యులు వ్యాఖ్యానించారు.

kodela family says no to government honours for funeral, కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు: కుటుంబసభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *