మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.. భోరున రోదిస్తూ.. కోడెల కూతురు

Kodela Daughter Vijaya Lakshmi Emotional Words About Her Father, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.. భోరున రోదిస్తూ.. కోడెల కూతురు

కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఆయన కూతురు విజయలక్ష్మి స్పందించారు. మా నాన్న అంటే మాకు ప్రాణమని.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేని పోని కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపించారు. నిత్యం కూతురు, కోడుకు అంటూ కేసులు పెడుతూ వేధించడంతో మానసికంగా ఎంత నరకం అనుభవిస్తూ.. ఎంత బాధపడ్డారో తమకు తెలుసని అన్నారు. కనీసం ఇప్పుడైనా.. ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించకండంటూ రోదిస్తూ వేడుకుంది. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండన్న ఆమె.. చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేస్తున్నారని.. దయచేసి అలా చేయకండంటూ వేడుకున్నారు. కనీసం మా తండ్రి వయస్సుకు అయినా గౌరవం ఇవ్వండని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *