Breaking News
 • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
 • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
 • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
 • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
 • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
 • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
 • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
 • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ!

Kodela Suicide Mystery, ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్‌మెన్ ఆదాబ్‌కు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పలు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో18 మందిని సాక్షులను విచారించారు. విచారణ నిమిత్తం వాంగూల్మం ఇచ్చేందుకు హాజరుకావాలని కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలను పోలీసులు ఆదేశించారు. అయితే 11 రోజుల తరువాత వస్తామని వారిద్దరూ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఇక చనిపోయిన రోజు కోడెల తిన్న ఆహారాన్ని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

 

కోడెల ఆత్మహత్య కేసులో మిస్టరీగా ఉన్న అంశాలు:

 1. కోడెల సూసైడ్ నోట్ రాయలేదు కాబట్టి..ఆయన ఫోన్‌లో ఏమైనా సెల్పీ వీడియోను రికార్డు చేశారా?
 2. ఆ ఫోన్‌ను కుటుంబ సభ్యులు ఎందుకు పోలీసులకు అప్పగించడం లేదు?
 3.  చనిపోవడానికి ముందుగా 15 రోజుల క్రితం ఆయన సూసైడ్‌కి ప్రయత్నించినప్పటికి ఆ విషయం ఎందుకు బయటకు రాలేదు
 4. రాజకీయ వేధింపులు ఆయనకు కొత్తవా? గతంలో ఆయన ప్రతిపక్షంలో ఎన్నేళ్లు పనిచేయలేదు.
 5. ఆత్మహత్యకు కుమారుడి వేధింపులే కారణమంటూ పలువురు చేస్తున్న ఫిర్యాదుల విషయంలో వాస్తవం ఎంత? కోడెలకు, కుమారుడికి మధ్య విభేదాలు ఉన్నాాయా?
 6. తనపై, కుటుంబ సభ్యులపై ఉన్న కేసులే ఆయనను ఆత్మహత్య దిశగా ప్రేరేపించాయా?